logo

వ్య‌క్తి పై నుంచి వెళ్ళిన లారీ


31-May-2019 14:56IST
Larry who went from person to top

జియాపల్లి(బీబీనగర్‌) : వేసవిలో ఉక్కపోతను భరించలేక ఆరుబయట పడుకున్న వ్యక్తిపై నుంచి లారీ వెనక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లిలో  చోటుచేసుకుంది. ఎస్సై సుధాకర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండీ జహంగీర్‌(45) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌. ఉపాధి కోసం భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్‌లో నివాసముంటున్నారు. అప్పుడప్పుడు గ్రామంలోని పాత ఇంటికి వచ్చి ఇక్కడి నుంచే విధులకు హాజరవుతుంటాడు.  
జియాపల్లిలోని పాత ఇంటికి వచ్చిన మృతుడు ఇంటి బయట (సీసీ రోడ్డు పక్కన) పడుకున్నాడు. నిద్రలో జారుకున్నాక అర్ధరాత్రి సమయంలో బొమ్మలరామారం నుంచి జమిలాపేట్‌ వైపు వెళ్లే లారీ గ్రామం నుంచి వెళ్తుండగా అటు వైపు రోడ్డు మూసివేసి ఉండడంతో లారీ డ్రైవర్‌ జహంగీర్‌ పడుకున్న గల్లీ వైపు వెళ్లి మలుపుకున్నారు.  సీసీ రోడ్డు పక్కన పడుకున్న జహంగీర్‌పై నుంచి లారీ వెనక చక్రాలు ఎక్కాయి. గమనించని డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉద‌యం గ్రామపంచాయతీ సిబ్బంది రోడ్లు ఉడ్చేందుకని పడుకున్న అతన్ని లేపేందుకు యత్రించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. సర్పంచ్‌ కుమార్‌ సాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి ఒంటిపై ఉన్న లారీ చక్రాల అద్దుల ఆధారంగా అతడిపై నుంచి లారీ వెళ్లిందని గమనించి అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. కెమెరాల్లో లారీ వెళ్లడం వల్లే జహంగీర్‌ మృతిచెందాడని తేలింది. కానీ లారీ నెంబర్‌ కనిపించడం లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌గౌడ్‌ తెలిపారు. 

Tags: Larry went person top

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top