logo

పట్టపగలే వ్యక్తి దారుణ హత్య


31-May-2019 15:23IST
daylight murder of a man

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద జాతీయ ర‌హ‌దారిపై దారుణ హత్య జరిగింది. న‌డిరోడ్డుపై పట్టపగలే.. అందరూ చూస్తుండగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. మహబూబ్ అనే వ్యక్తిని నరికి చంపి పరారీ అయ్యారు. మహబూబ్‌ ను మూడు నాలుగు సార్లు కత్తితో విచక్షణారహితంగా నరికారు. ఒకానొక దశలో కత్తి మెడలోనే ఇరుక్కుపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు మహబూబ్‌ను దుండగుడు బలవంతంగా కాలుతో తొక్కాడు. అనంతరం కత్తిని తీసుకుని అటునుంచి పారిపోయాడు. ఈ ఘటన జరిగిన సమయంలో జాతీయ రహదారిపై ఏ ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేదు. దుండగులను ఆపేందుకు ఏ ఒక్కరు కూడా సాహసం చేయలేదు. ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: daylight murder sangareddy national hyway

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top