logo

మల్లెల నూనెతో కలిగే ప్రయోజనాలు ఇవే..!


03-Jan-2020 20:48IST
benefits of jasmine oil

మల్లెపూలన్నా.. వాటి సువాసనన్నా ఇష్టపడని వారుండరు. వాటి నుండి వచ్చే సువాసనకు ఎవ్వరైనా ముగ్దులు కావాల్సిందే. అందుకనే మహిళలు చాలా వరకు వీటిని వారి తల్లో సింగారించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వీటి సువాసనతో చేసే అత్తరుని వాడని ముస్లీమ్ ఉండడు. అయితే వాటి నుంచి తీసే నూనె ద్వారా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. దాన్నే జాస్మిన్ ఆయిల్ అని అంటారు. దాంతో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1) కొన్ని చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌ను కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను క‌లిపి నొప్పిగా ఉన్న కండరాల‌పై రాస్తే ఫ‌లితం ఉంటుంది. వెంట‌నే నొప్పి త‌గ్గుతుంది. అయితే ఆలివ్ ఆయిల్‌కు బ‌దులుగా వేడి నీటిని కూడా ఉప‌యోగించవ‌చ్చు. కానీ వేడి నీటితో అయితే కాప‌డంలా పెట్టాల్సి ఉంటుంది.అలాగే ఒకటి రెండు చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌ను శుభ్ర‌మైన వ‌స్త్రంపై వేసి దాన్ని వాస‌న చూడాలి. దీంతో ఆందోళ‌న‌, ఒత్తిడి క్ష‌ణాల్లో త‌గ్గుతాయి. మంచి మూడ్‌లోకి వ‌స్తారు. మాన‌సిక ప్ర‌శాంతత క‌లుగుతుంది.

2) కొన్ని చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌ను స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు త‌గ్గుతాయి.

3) జాస్మిన్ ఆయిల్‌ను ఫేస్ వాష్‌లా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. కొన్ని చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌, కొబ్బ‌రినూనెలను బాగా క‌లిపి ముఖానికి మ‌ర్ద‌నా చేసి కొంత సేప‌టి త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది. జాస్మిన్ ఆయిల్‌ను వెంట్రుల‌కు నిత్యం రాస్తుంటే.. జుట్టు స‌మ‌స్య‌లు పోతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు కూడా తిరిగి రాకుండా ఉంటుంది.




Related image

Tags: benefits jasmine oil

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top