logo

దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తి అరెస్ట్‌


31-May-2019 15:34IST
Arrested by theft


కట్టంగూరు : దొంగతనం సొమ్ము, భద్రపరచిన వ్యక్తిని అరెస్టు చేసి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. 2019 పిబ్రవరి 15న అయిటిపాములకు చెందిన అనంతుల సైదులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూర్యాపేటకు చెందిన గాజుల ప్రశాంత్‌, నేరేళ్ల శ్రీరామ్‌ అనే వ్యక్తులు బీరువాను ధ్వంసం చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారని .ఎస్సై అంతిరెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు.  చివ్వెంల మండలం తిమ్మపురానికి చెందిన ఎస్‌కే.ఆరీఫ్‌కు వాటిని ఇచ్చి  భద్రపరచమన్నారు. కట్టంగూరులోని నల్గొండ బస్టాఫ్ లో అనుమానాస్పదంగా క‌నిపించిన  ఆరీఫ్‌ను పోలీసులు పట్టుకుని, అతని వ‌ద్ద  నుంచి ఒక ఉంగరం, జత దిద్దులతో పాటు, ఒక జత కమ్మల బుట్టాలు స్వాధీన పరచుకున్నట్లు వివరించారు. చాగచక్యంగా వ్యవహరించిన ఐడీ పార్టీ సిబ్బంది శ్రీరాములు, శంషులను ఎస్సై అభినందించారు.

Tags: Arrested theft police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top