logo

కడుపులో మంట త‌గ్గా‌లంటే ఇలా చేయండి


04-Jan-2020 21:05IST
inflammation of the stomach do like this

ప్రస్తుత కాలంలో మనకున్న ఆహారపు అలవాట్ల వలన మనకు ఆహారం అరగకపోవడం గానీ, అలాగే కొన్ని సార్లు మనం సరైన సమయంలో భోజనం చేయకుంటే గ్యాస్ట్రైటిస్‌ లాటివి మనల్ని బాగా వెంబడిస్తుంటాయి. మరో వైపు మనకున్న బిజీ షెడ్యూల్ వలన మనము నిద్రకు కరువవుతూ ఉంటుంది. ఈ క్రమంలో మనల్ని తలనొప్పి, బాడీ పైన్స్ లాంటివి పట్టీ పీడిస్తుంటాయి. దాంతో వాటి నివారణ కోసం మనలో చాలా మంది యాస్ర్పిన్‌, నొప్పిబిళ్లల వంటివి ఎక్కువగా వాడుతుంటాము. వీటిని వాడటం వల్ల పొట్టలో గోడలు, పొర దెబ్బతింటాయి. ఖాళీ కడుపుతో కాఫీ, టీలు, నిమ్మరసం తాగినా, వేడి పదార్థాలు తిన్నా కొంత మందికి క‌డుపులో మంట వ‌స్తోంది. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువైనా తీవ్ర గ్యాస్ట్రైటిస్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో బాధపడేవారికి ఆకలి ఉండదు. బ్రేక్‌ఫాస్ట్‌ చేయరు. వాంతులు అవుతాయి. ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు మన ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు అదెలానో తెలుసుకుందాం..!    .       

1) ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీళ్లల్లో రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసుకుని తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. అలాగే  పొట్టశుభ్రం కావడానికి పావు టీస్పూను నల్లజీలకర్ర తినాలి. తేనెతో కలిపిన ఓట్స్‌ను బ్రేక్‌ఫా్‌స్టలో తిన్నా ఫలితం ఉంటుంది.

2) బొప్పాయి గింజల పొడిని, పైనాపిల్‌ ముక్కలపై చల్లుకుని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపున తింటే సాంత్వన లభిస్తుంది. అంతే కాకుండా  ఆకుపచ్చని యాలకులు, సోంపు గింజలు, దాల్చినచెక్కలను సమపాళ్లలో తీసుకుని పాన్‌లో నూనె లేకుండా 30సెకన్లు వేగించి మెత్తటి పొడిలా చేయాలి. ఈ పొడిని భోజనంతో పాటు అరటీస్పూను తినాలి.

3)  అల్లం, ఉల్లిపాయలు సమంగా తీసుకుని జ్యూసులా చేసి రోజూ రెండుసార్లు తాగాలి. పెరుగు, క్యారెట్‌ జ్యూసు, కొబ్బరినీళ్లు, తేనె, తాజా పళ్లు, కాయగూరలు, ఆకుకూరలు, తక్కువ ఫ్యాట్‌ ఉన్న పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా బీన్స్‌, కాఫీ, టీ, నిమ్మ, ఆరెంజ్‌ జ్యూసు, మసాలా వంటకాలు, ఆల్కహాల్‌, మాంసం వంటి వాటికి కొంత కలం వరకు దూరంగా ఉండటం మంచిది.



Related image



Tags: inflammation stomach do like this

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top