logo

నేడు ఏపీ, తెలంగాణలలో యాక్సిడెంట్ల సంక్షిప్త సమాచారం...


01-Jun-2019 09:30IST
ap telangana accidents full details


తెలుగు రాష్ట్రాలలో వరుసగా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ల కారణం వాళ్ళ రోజుకు కనీసం 10 నుంచి 12 మంది అయినా మృతి చెందుతున్నారు. ఈ కోణంలోనే నేడు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో జరిగిన యాక్సిడెంట్ల సంక్షిప్త సమాచారం..  

కర్నూలు జిల్లాలోని కంబాలపాడు సర్కిల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 6గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న గరుడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రెండు లారీలను ఢీకొన్నది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలవ్వగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు బ్రేక్ వైర్ తెగిపోవడంతో కృష్ణా నందిగామ మండలం అనాసాగరం జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు వేరే బస్సులో తరలించారు.

కర్నూలు డోన్‌ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు లారీ, క్రూజర్‌ను ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదం డోన్‌ సమీపంలో జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు. లారీ, క్రూజర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. 

నల్లగొండ జిల్లాలోని పట్టణ శివారులో చర్లపల్లి బైపాస్ వద్ద గోర ప్రమాదం జరిగింది. కారును ఢీకొట్టి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న బైక్‌ను బస్సు ఢీకొన్నది. బైక్‌పై ప్రయాణిస్తున్న రేణుక అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదండీ ఇవాల్టి యాక్సిడెంట్ల సమాచారం. 

Tags: ap telangana accidents kurnool krishna nalgonda

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top