తెలంగాణలో భారీగా కోవిడ్‌ కేసులు.. హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రస్తుతం తెలంగాణలో భారీ స్థాయిలో పెరుగుతున్న కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణలో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని తెలిపింది. కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు… Continue reading తెలంగాణలో భారీగా కోవిడ్‌ కేసులు.. హైకోర్టు కీలక ఆదేశాలు

యజమాని పైశాచికం.. యువకుడు బలి

నిజామాబాద్ జిల్లాలో ఒక యజమాని పైశాచికానికి ఓ అమాయకుడు బలయ్యాడు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రెండు రోజులుగా ఓ యువకుడిని గదిలో వేసి యజమాని చితకబాదడంతో.. సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం. దెబ్బలు భరించలేక ఆర్మూర్ నుండి నిజామాబాద్ తప్పించుకుని వచ్చిన యువకుడు.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు బాధితున్ని సమీప ప్రాంతంలోని ఆసుపత్రిలోకి తరలించారు. పది వేలు తీసుకుంటే.. రూ. 25 వేలు ఇవ్వాలని కొట్టారంటూ బాధితుడు అరుణ్… Continue reading యజమాని పైశాచికం.. యువకుడు బలి

‘పుష్ప’ని కాపీ కొట్టిన అమూల్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హ‌వా జోరుగా కొనసాగుతుంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప దేశవ్యాప్తంగా రిలీజై భారీ హిట్ అందుకుంది. పాన్ ఇండియా సినిమా విజ‌యాన్ని అందుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు బ‌న్నీ. నార్త్‌, సౌత్ అన్న తేడా లేకుండా అంత‌టా ఈ సినిమా మార్మోగిపోతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ క్రేజ్‌ను త‌న‌కు అనుకూలంగా మలుచుకుంది అమూల్‌. సాధార‌ణంగా అమూల్‌ వ్యాపార వాణిజ్య ప్ర‌క‌ట‌నలో చాలా… Continue reading ‘పుష్ప’ని కాపీ కొట్టిన అమూల్

భారీగా పెరిగిన బంగారం ధరలు!

ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం బంగారాన్ని కొనగలుగుతున్న సమయంలో మళ్ళీ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో రూ.44,800గా అందుబాటులో ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం రూ.4,480కి లభిస్తోంది. మార్కెట్లో లభించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని వ్యాపారులు ఎక్కువగా పెట్టుబడుల్లో వినియోగిస్తారు. ఈ బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.48,880గా ఉంది. నిన్నటితో పోల్చితే… Continue reading భారీగా పెరిగిన బంగారం ధరలు!

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!